Imran Khan | ఇస్లామాబాద్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధం విధించనున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. విదేశీ నిధుల కేసు, మే 9 నాటి అల్లర్లు తదితర అంశాలు పీటీఐ నిషేధానికి సాక్ష్యాలుగా పనికి వస్తాయని పేర్కొంది.