హైదరాబాద్: యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ సైటింగ్స్లో పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ చిరుతపులిని బబూన్ కోతులు అటాక్(Baboons Attack) చేసిన తీరు హైలెట్గా ఉంది. దాదాపు 50 కోతుల వరకు ఆ చిరుతకు చుక్కలు చూపించాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. రిక్కీ దా ఫోనెస్కా షేర్ చేసిన ఆ వీడియోలో.. తొలుత రోడ్డుపై వేటకు వెళ్తున్న ఓ చిరుతను చూపించారు. ఆ తర్వాత బబూన్ కోతుల గ్యాంగ్ కూడా కనిపిస్తోంది. వాహనాల మధ్య నుంచి బబూన్ కోతులు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. వెనుక నుంచి వచ్చిన ఓ చిరుత సడెన్గా వాటిపై దాడి చేసింది. ఆ సమయంలో ముందు పరుగెత్తేందుకు ప్రయత్నించిన బబూన్లు.. ఆ తర్వాత వెంటనే చిరుతపై తిరుగబడ్డాయి. పెద్ద పెద్ద బబూన్లు వచ్చి ఒక్కసారిగా చిరుతను కిందపడేశాయి. బబూన్ కోతులతో పోరాడిన చిరుత చివరకు చేతులు ఎత్తేసింది. బబూన్ కోతల దాడి నుంచి ఆ చిరుత ప్పించుకున్నది. ఈ ఘటనకు చెందిన వీడియో ఇదే.