B-2 Bomber | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలపై మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. అయితే, అమెరికా జోక్యం తప్పదన్న చర్చలు గత కొద్దిరోజులుగా సాగుతున్నాయి. చివరకు అదే నిజమైంది. శనివారం అర్ధరాత్రి అనంతరం అమెరికా వైమానిక దళాలు ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై భీకర దాడులకు పాల్పడ్డాయి. దీంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల విషయాన్ని ప్రకటించారు. ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడులకు బీ-2 స్టెల్త్ బాంబర్‌ను వినియోగించినట్టు తెలిపారు. ఫోర్డోలోని భూగర్భ అణు స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు ఆరు బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టు వెల్లడించారు. నాటాంజ్, ఇస్ఫహాన్‌లపై దాడికి 30 టొమాహాక్ క్షిపణులను ప్రయోగించినట్టు చెప్పారు.
అమెరికా వాయుసేనకు చెందిన బీ-2 స్టెల్త్ బాంబర్ ఓ ప్రత్యేకతలు గల యుద్ధ విమానం. 1989లో తొలిసారిగా అమెరికా ఈ బాంబర్‌ను వాడింది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా స్టెల్త్ సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ విమానం శత్రుదేశాల రాడార్లను కనిపించకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన విమానాల్లో ఇది ఒకటిగా ఉండటం విశేషం. నార్త్రప్ గ్రమ్మన్ అనే అమెరికా సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది భూగర్భంలో ఉన్న స్థావరాలను సైతం విజయవంతంగా ధ్వంసం చేసే సామర్థ్యం ఉంటుంది. దీనికి చాలా తక్కువ రాడార్ సిగ్నల్ ఉంటుంది. చిన్న పక్షి మాదిరిగా కనిపిస్తుంది. 6వేల నాటికల్ మైల్స్ దూరం ప్రయాణించడంతో పాటు
దూరం ప్రయాణించగలదు. శక్తివంతమైన ఆయుధాలను మూసుకెళ్లగల సత్తా దీనికి ఉన్నది.
ఆయుధాలను మోసుకెళ్లగలదు.
ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై దాడులకు పాల్పడింది. అవి భూగర్భంలో ఉండడంతో పెద్దగా నష్టం జరుగలేదు. కానీ, భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్ వద్ద లేదు. ఇలాంటి తరుణంలో అమెరికా రంగప్రవేశం చేసింది. ప్రత్యేకంగా భూగర్భ స్థావరాల కోసం రూపొందించిన 30వేల పౌండ్ల మాసివ్ ఓర్డినెన్స్ పెనెట్రేటర్ (బంకర్ బస్టర్ బాంబులు) బీ-2 బాంబర్ ద్వారా ప్రయోగించింది. బంకర్ బస్టర్లు భూగర్భంలో ఉన్న గుహలను, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకునే శక్తివంతమైన బాంబులు. ఇవి జీపీఎస్ ఆధారంగా పని చేస్తాయి. అధిక భద్రత కలిగిన ప్రాంతాల్లోనూ వీటిని ఉపయోగించి ఖచ్చితంగా దాడి చేయొచ్చు. అమెరికా దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం, అణు కేంద్రాలపై గగనతల దాడులు జరగడం ప్రపంచానికే ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.