న్యూఢిల్లీ : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఎవర్గ్రీన్ సాంగ్ మేరా దిల్ యే పుకారే ఆజా రీమిక్స్ వెర్షన్ డ్యాన్స్ వీడియోతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిన పాక్ యువతి ఆయేషా మరో పెర్ఫామెన్స్‌తో ముందుకొచ్చింది. ఆయేషా షేర్ చేసిన లిప్‌సింక్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈసారి బాలీవుడ్ హిట్‌మేకర్ బాద్షా పెప్పీ సాంగ్‌కు లిప్సింక్స్తో ఇంటర్నెట్ను ఆయేషా ఇంప్రెస్ చేసింది. ఈ సాంగ్ లిరిక్స్‌కు లిప్సింక్స్తో అదరగొట్టిన ఆయేషా ఆపై పాట ముందుకు సాగుతుండగా డ్రెస్సులు మార్చుతూ స్టైలిష్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 50,000కుపైగా వ్యూస్ లభించాయి. ఆయేషా వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ సాంగ్‌ను బాదర్సా, కరణ్ అజ్ల ఆలపించగా ఈ పెప్పీ ట్రాక్ విడుదలైనప్పటి నుంచి 1.7 కోట్ల మంది సాంగ్‌ను వీక్షించారు.