వియాన్నా : ఆస్ట్రియాలోని రెండో పెద్ద నగరమైన గ్రాజ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోర్గ్ డ్రెయిర్షుట్జెన్గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతరం నిందితుడైన విద్యార్థి పాఠశాల టాయిలెట్లో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు నగర మేయర్ ఇల్కీ కార్ వెల్లడించారు.