ఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినతరం
అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందుకు ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను తీసుకొచ్చింది.
కాన్బెర్రా: అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాలతో ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందుకు ఆ దేశ ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. దీంతో తాత్కాలిక వీసా హోల్డర్లు ఇకపై ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేవలం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేవారికే వీసాలను మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్ క్రూ వీసాల వంటి తాత్కాలిక వీసా హోల్డర్లు వచ్చే నెల ఒకటి నుంచి ఆస్ట్రేలియాలో ఉంటూ, స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండదు. దీని ప్రభావం ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై పడుతుంది. ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విజిటర్ వీసా దరఖాస్తుదారులు ఆ దేశం వెలుపలి నుంచి దరఖాస్తు చేయాలి. తాత్కాలిక వీసాలు తీసుకున్న అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో నిరవధికంగా ఉండిపోవడాన్ని నిరోధించేందుకు ఆ దేశం ఈ చర్యలు చేపట్టింది. గత ఏడాది డిసెంబరు 11న ప్రకటించిన నూతన మైగ్రేషన్ వ్యూహంలో భాగంగా ఈ మార్పులను తీసుకొచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

