సిడ్నీ, జూన్ 1: కరోనా వైరస్‌ను చంపడంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక రకమైన వెల్లుల్లి 99.9 శాతం సమర్థతతో పని చేస్తున్నదని మెల్బోర్న్లోని పీటర్ డొహెర్టీ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 18 నెలలుగా వెల్లుల్లి లక్షణాలపై వీరు పరిశోధనలు జరుపుతున్నారు.
ఆస్ట్రేలియాలో పెరిగే ఒక రకమైన వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, ఇవి కరోనా వైరస్‌తో పాటు ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్‌లపై 99.9 శాతం సమర్థతతో పని చేస్తున్నాయని గుర్తించారు. అయితే, ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని, మనుషుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలుసుకోవాల్సి ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.