నాటో సభ్యదేశాలపై రష్యా దాడులకు దిగితే నాటో కచ్చితంగా రంగంలోకి దిగుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ తెలిపారు. నాటోలో ఒక్క అంగుళాన్నీ వదులుకోబోమని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ల్వీవ్, మార్చి 13: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఆదివారం మరో మలుపు తీసుకొన్నది. తొలుత సైనిక స్థావరాలపై.. తర్వాత జనావాసాలపై.. ఆ తర్వాత ఎయిర్‌పోర్టులపై దాడులు చేస్తూ వస్తున్న రష్యా బలగాలు తాజాగా ఉక్రెయిన్‌కు అందుతున్న విదేశీ మిలిటరీ సాయంపై కన్నేశాయి. పోలండ్ నుంచి ఆయుధ సాయం అందకుండా అక్కడ క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్, పోలండ్ సరిహద్దుల్లో ఉన్న యువోరివ్ సైనిక శిక్షణ కేంద్రంపైకి రష్యా ఆదివారం దాదాపు 30 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 35 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి. నాటో సభ్య దేశమైన పోలండ్ సరిహద్దుకు కేవలం 25 కి.మీ. దూరంలోనే ఉంది. రష్యా ఆక్రమణ ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌కు విదేశీ సాయం పోలండ్ ద్వారానే అందుతున్నది. నాటో దేశాలకు అతి దగ్గరి ప్రాంతం ఇదే కావడం విశేషం. యువోరివ్ శిక్షణ కేంద్రంలో ఉక్రెయిన్ సైన్యానికి నాటో, అమెరికా శిక్షణనిస్తున్నాయి. నాటో మిలిటరీ డ్రిల్స్‌కు కూడా గతంలో ఇది వేదికైంది.
మానవతా కారిడార్లపైనా దాడులు
శరణార్థులను తరలించడానికి ఏర్పాటు చేసిన మానవతా కారిడార్లపై కూడా రష్యా బాంబుదాడులు చేస్తున్నది. ఆదివారం ఉక్రెయిన్ శరణార్థుల కాన్వాయ్‌పై రష్యా చేసిన దాడిలో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. వీరిలో ఒక పాప కూడా ఉంది. రష్యా బలగాలు ఆదివారం మరో మేయర్‌ను కిడ్నాప్ చేశాయి. జపోరిజియా ప్రాంతంలోని నీప్రో నగర మేయర్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం మెలిటోపోల్ నగర మేయర్‌ను కూడా అపహరించిన సంగతి తెలిసిందే.
డోనెస్క్లాగే ఖేర్సన్ను విడగొట్టే ప్రయత్నం
ఉక్రెయిన్ను విడగొట్టడానికి రష్యా ప్రయత్నిస్తున్నదని జెలెన్స్కీ ఆరోపించారు. 2014లో లుహాన్స్, డోనెస్క్ ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టినట్టే ఖేర్సన్ నగరంలో కూడా చేయడానికి రష్యా ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఖేర్సన్లో తమ అనుకూలవాదులతో ప్రభుత్వ ఏర్పాటు కోసం స్థానిక నేతలకు లంచం ఆశ చూపుతున్నారని, వినకపోతే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆశ్రయమిస్తే నెలకు 35వేలు
ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులకు బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్’ పథకాన్ని ప్రకటించింది. బ్రిటన్ వాసులు ఎవరైనా ఉక్రెయిన్ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే వారికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతి నెల రూ.35వేలు చొప్పున చెల్లిస్తుంది.