హైతీలో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవదహనం!
At Least 50 Burned Alive In Haiti Gas Tanker Explosion | హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో

పోర్ట్ ఓ ప్రిన్స్ : హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో కనీసం 50 మంది సజీవ దహనమయ్యారు. ‘సంఘటనా స్థలంలో 50 నుంచి 54 మంది సజీవంగా దహనమవడం చూశాను’ అని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనోర్ పేర్కొన్నారు.
మృతులను గుర్తించడం అసాధ్యమన్న ఆయన.. పేలుడు కారణంగా సంఘటనా స్థలంలో సుమారు ఇండ్లు కాలిపోయాయన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇటీవల ముఠాలు గ్యాస్లైన్లను స్వాధీనం చేసుకోవడంతో హైతీలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

