Rwanda Floods | రువాండాలో వర్ష బీభత్సం.. 135 మంది మృతి
Rwanda Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన రువాండా (Rwanda)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు (floods) సంభవించాయి.
Rwanda Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన రువాండా (Rwanda)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు (floods) సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా ముంచెత్తిన వరదలతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Rwanda Floods 2
ఆ దేశ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా రువాండాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. నదులు ప్రమాదకర స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా ఉత్తర, పశ్చిమ ప్రావిన్స్ల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో పలు చోట్లు ఇల్లు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లు కొట్టుకుపోయి రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు పొలాలు ముంపునకు గురవ్వడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Rwanda Floods 3
ఈ వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 135 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ (RBA) తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వరదల్లో కొంతమంది కొట్టుకుపోయారని.. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినట్లు తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్బీఏ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చిత్తడి నేలలు, లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది.
Also Read..
Mary Kom | నా రాష్ట్రం మణిపూర్ మండిపోతోంది.. సాయం చేయండి : మేరీ కోమ్
Russia – Ukraine | ఖేర్సన్పై క్రెమ్లిన్ ప్రతీకార దాడి.. 21 మంది పౌరులు మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

