Islamabad hospital | పెను విషాదం.. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది పసికందుల దుర్మరణం..!
Islamabad hospital | పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రఖ్యాత ఆసుపత్రి (Hospital) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) లో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
Islamabad hospital : పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రఖ్యాత ఆసుపత్రి (Hospital) లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం (Fire accident) లో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రిలో జరిగింది.
బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డుకు అనుబంధంగా ఉన్న నర్సరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నర్సరీలోని ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో నర్సరీలో మొత్తం 16 మంది పసికందులు ఉండగా.. కేవలం ఒక్క శిశువును మాత్రమే సిబ్బంది కాపాడగలిగారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం కూలింగ్ ఆపరేషన్స్ చేపట్టాయి. మృతుల సంఖ్యపై తొలుత కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మందిగా పేర్కొన్నప్పటికీ.. స్థానిక మీడియా, ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మరణించినట్లు ధ్రువీకరించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

