మధ్యధరా సముద్రంలో బోటు మునక.. 130 మంది దుర్మరణం..!
Boat accident: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవటం కోసం రబ్బర్ బోటులో వెళ్తున్న 130 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది.

కైరో: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఆఫ్రికా నుంచి యూరప్ చేరుకోవటం కోసం రబ్బర్ బోటులో వెళ్తున్న 130 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో శనివారం గుర్తించారు.
బోటు దగ్గరకు వెళ్లి చూడగా అందులో ప్రయాణికులు లేరు. కానీ, ఆ బోటు చుట్టూ పదికిపైగా శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. దాంతో వారంతా మరణించి ఉంటారని ఐక్యరాజ్యసమితి వలసదారుల సంక్షేమ విభాగం వెల్లడించింది. అదేవిధంగా ట్రిపోలికి తూర్పున మరో రెండు రబ్బర్ పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
పేదరికం, అంతర్యుద్ధం కారణంగా ఆఫ్రికాలో బతుకడం దుర్బరంగా మారుతుండటంతో చాలామంది మెరుగైన జీవితం కోసం మధ్యధరా సముద్రం గుండా యూరప్‌లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ఇందుకోసం రబ్బరు బోట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే బోట్ల నిర్వాహకులు వాటిలో పరిమితికి మించి వలసదారులను తీసుకెళ్తుంటారు. అందువల్లే 130 మందితో బయలుదేరిన రబ్బర్ బోటు మునిగిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

