వాంకోవర్ : కెనడాలోని వాంకోవర్‌లో శనివారం రాత్రి ఫిలిపినో వారసత్వ, సాంస్కృతిక సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రజలు ఉత్సాహంగా లపు లపు డే ఫెస్టివల్‌ను జరుపుకుంటుండగా, ఓ కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో 11 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. 30 ఏళ్ల వ్యక్తి ఈ కారును నడిపినట్లు పోలీసులు ప్రకటించారు. అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సంఘటన వెనుకగల ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రమాదమా? ఉగ్రవాద దాడా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.