China Rains: చైనాలో ఆకస్మిక వరదలు.. బ్రిడ్జ్ కూలి 11 మంది మృతి.. 30 మంది గల్లంతు
China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో.. శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఆ ప్రమాదం వల్ల 11 మంది మృతిచెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.
బీజింగ్: చైనాలో భారీ వర్షాలు(China Rains) కురుస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో.. శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఆ ప్రమాదం వల్ల 11 మంది మృతిచెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు. జాసుయి కౌంటీలో ఉన్న డానింగ్ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి నదిలో పడ్డ అయిదు వాహనాల నుంచి 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చైనా మీడియా పేర్కొన్నది. అయితే ఈ ప్రమాదం వల్ల అదృశ్యమైన మరో 20 వాహనాల ఆచూకీ ఇంకా తెలియలేదు.
ఈ ప్రమాదం పట్ల అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆరా తీశారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో వరద నియంత్రణ సమస్యాత్మకంగా ఉన్నట్లు జిన్‌పింగ్ తెలిపారు. అయితే స్థానిక ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకుని , అన్నింటిని మానిటర్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అథారిటీ.. బ్రిడ్జ్ కూలిన ప్రదేశానికి ప్రత్యేక బృందాన్ని పంపినట్లు చెప్పింది. రెస్క్యూ బృందంలో 859 మంది, 90 వాహనాలు, 20 బోట్లు, 41 డ్రోన్లు ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

