New Year 2024 | న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?
New Year 2024 | ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాది (New Year 2024) కి స్వాగతం పలుకుతోంది. న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే నూతన సంవత్సరం తొలి రోజు అమెరికాలో ముగుస్తుంది. అయితే అంతరిక్షంలోని వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 16 సార్లు న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు.
వాషింగ్టన్: ప్రపంచమంతా ఘనంగా కొత్త ఏడాది (New Year 2024)కి స్వాగతం పలుకుతోంది. న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే నూతన సంవత్సరం తొలి రోజు అమెరికాలో ముగుస్తుంది. అయితే అంతరిక్షంలోని వ్యోమగాములు మాత్రం ప్రతి ఏటా జనవరి 1న 16 సార్లు న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్ణీత కక్ష్యలో భూమిచుట్టూ అత్యంత వేగంతో పరిభ్రమించడమే దీనికి కారణం.
కాగా, అంతరిక్షంలోని ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది. దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు.
మరోవైపు ఐఎస్ఎస్ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు పరిభ్రమిస్తుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు కొత్త ఏడాదిని 16 సార్లు స్వాగతం పలుకుతారు. న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుందని నాసా పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

