న్యూయార్క్, జూన్ 21: సౌరకుటుంబంలో అత్యంత విలువైన గ్రహశకలాల్లో ఒకటిగా భావిస్తున్న ‘16 సైకీ’ ఆస్టరాయిడ్ అంచనా వేసినంత విలువైనది కాదని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ గ్రహశకలం ఇనుము, నికెల్, బంగారం వంటి లోహాలతో 95 శాతం వరకు నిండి ఉన్నదని గతంలో భావించారు. దీని విలువ దాదాపు 10,00,000 లక్షల కోట్ల డాలర్లకు సమానమని అంచనా వేశారు. అయితే, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో ‘16 సైకీ’ గ్రహశకలంపై విలువైన లోహాలేమీలేవని గుర్తించారు. ఆస్టరాయిడ్లో 35 శాతం భాగం ఖాళీగానే ఉన్నట్టు తెలిపారు.