మాస్కో, అక్టోబర్ 26: ఉక్రెయిన్‌తో యుద్ధం తీవ్రస్థాయికి చేరిన వేళ.. రష్యా బుధవారం అణువిన్యాసాలు చేపట్టింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వీటిని పర్యవేక్షించారు. అణు విన్యాసాల్లో భాగంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌ను రష్యా పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు రష్యా తెలిపింది. నాటో అణువిన్యాసాలను చేపడుతున్న సమయంలోనే రష్యా ఈ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం.