కీవ్: ఒక సైనికుడి ఛాతిలో లైవ్ గ్రెనేడ్ చిక్కుకుంది. అది ఏ క్షణంలో అయినా పేలే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆర్మీ డాక్టర్ పెద్ద సాహసం చేశారు. డేరింగ్ సర్జరీ ద్వారా ఆ లైవ్ గ్రెనేడ్‌ను తొలగించారు. ఉక్రెయిన్‌లో ఈ సంఘటన జరిగింది. రష్యా ఆర్మీ దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికుడి ఛాతిలోకి లైవ్ గ్రెనేడ్ దిగింది. ఏ మాత్రం ఒత్తిడి కలిగినా అది పేలే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఒక ఆర్మీ డాక్టర్ సాహసం చేశారు. సర్జన్ మేజర్ జనరల్ ఆండ్రీ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సైనికుడి ఛాతిలో దిగిన లైవ్ గ్రెనేడ్‌ను విజయవంతంగా తొలగించారు. సర్జరీ సమయంలో అది పేలకుండా ఉండేందుకు నిఫుణులైన ఇద్దరు సైనికుల సహాయం తీసుకున్నారు.
కాగా, ఉక్రెయిన్ ఆర్మీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. సైనికుడి ఛాతిలో దిగిన గ్రెనేడ్ ఎక్స్‌రే ఫొటోతోపాటు తొలగించిన తర్వాత దానిని చేతిలో పట్టుకున్న ఆర్మీ డాక్టర్ ఫొటోను కూడా విడుదల చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సాహసం చేసి సైనికుడి ఛాతి భాగంలోకి దిగిన లైవ్ గ్రెనేడ్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించిన ఆర్మీ డాక్టర్‌ను నెటిజన్లు ప్రశంసించారు. ఇలాంటి మరింత మంది డాక్టర్లను ఇవ్వాలంటూ దేవుడ్ని కోరారు. అలాగే రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ సైనికులు, ప్రజలను కాపాడాలని ప్రార్థించారు.