నెతన్యాహుకు దక్కని మెజారిటీ
ఇజ్రాయెల్ ఎన్నికల పాక్షిక ఓట్ల లెక్కింపులో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని కూటమికి 53 సీట్లు రాగా మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు లభించాయి. దీంతో పార్లమెంట్లో నెతన్యాహు కూటమి మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే అరబ్ నేతృత్వంలోని పార్టీలు 19 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేయడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అనిశ్చితంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)ని ఉటంకిస్తూ స్థానిక మీడియా కథనాల ప్రకారం సాధారణ ఓట్లలో 91 శాతం లెక్కింపు పూర్తయ్యింది. ఇది మొత్తం ఓట్లలో 85.6 శాతానికి సమానం.
- ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
- మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా
- విపక్ష గాడి ఐసెన్‌కోట్ కూటమి
- ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన అరబ్ పార్టీల మద్దతు
జెరూసలెం, అక్టోబర్ 28: ఇజ్రాయెల్ ఎన్నికల పాక్షిక ఓట్ల లెక్కింపులో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని కూటమికి 53 సీట్లు రాగా మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు లభించాయి. దీంతో పార్లమెంట్లో నెతన్యాహు కూటమి మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. అయితే అరబ్ నేతృత్వంలోని పార్టీలు 19 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేయడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అనిశ్చితంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)ని ఉటంకిస్తూ స్థానిక మీడియా కథనాల ప్రకారం సాధారణ ఓట్లలో 91 శాతం లెక్కింపు పూర్తయ్యింది. ఇది మొత్తం ఓట్లలో 85.6 శాతానికి సమానం.
120 సభ్యుల ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెసెట్’లో మెజారిటీ సాధించడానికి కనీసం 61 స్థానాలు అవసరం. ప్రస్తుత లెక్కల ప్రకారం ఐసెన్‌కోట్ కూటమి, అరబ్ నేతృత్వంలోని పార్టీలకు కలిపి 67 సీట్లు ఉన్నాయి. వారు తమ రాజకీయ విభేదాలను అధిగమించగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పార్లమెంటరీ మద్దతు వారికి లభించే అవకాశం ఉంది.
అయితే అటువంటి ప్రభుత్వం ఏర్పడే అవకాశం అనిశ్చితంగానే ఉంది. అరబ్ నాయకత్వంలోని పార్టీలపై ఆధారపడటాన్ని నెతన్యాహు వ్యతిరేకించగా ప్రతిపక్ష నాయకుల మధ్య మాత్రం అటువంటి పార్టీలను సంకీర్ణంలో చేర్చుకోవాలా లేక బయట నుంచి వారి మద్దతు తీసుకోవాలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మిగిలిన ఏడు శాతం సాధారణ బ్యాలట్లకు అదనపు పర్యవేక్షణ అవసరమని సీఈసీ తెలిపింది. సుమారు 6 లక్షల డబుల్-ఎన్వలప్ బ్యాలట్లను కూడా ఇంకా లెక్కించాల్సి ఉందని సీఈసీని ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది.
చెల్లుబాటు అయ్యే ఓట్లలో 3.25 శాతంగా నిర్ణయించిన ఎన్నికల కనీస పరిమితిని రిజర్విస్ట్స్(2.6%), పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్(1.6%), హరేదీ పబ్లిక్(0.2%) అనే మూడు పార్టీలు అందుకోలేకపోయాయి. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ పార్టీల తుది ఓట్ల శాతం మారే అవకాశం ఉంది. కాగా ప్రధాన ప్రసార సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం నెతన్యాహు కూటమికి 50-52 స్థానాలు, ప్రతిపక్ష కూటమికి 51-53 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అరబ్ నేతృత్వంలోని పార్టీలు సుమారు 17-18 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేశాయి. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశలో కనిపిస్తున్నది. అయితే ఆయనకు మద్దతునిచ్చే కూటమికి మాత్రం మెజారిటీ లభించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

