శాన్ ఫ్రాన్సిస్కో: ఐఫోన్12(iPhone 12) అమ్మకాలపై ఫ్రాన్స్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. రేడియేషన్ వల్ల ఆ ఫోన్‌ను బ్యాన్ చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై యాపిల్ సంస్థ తాజాగా స్పందించింది. రేడియేషన్ సమస్యను తీర్చేందుకు ఐఫోన్ 12 హ్యాండ్ సెట్స్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. దీంతో ఫ్రాన్స్‌లో అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. యురోపియన్ యూనియన్ నిబంధనల కన్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్ 12 నుంచి రేడియేషన్ వస్తున్నట్లు ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ రెగ్యులేటరీ సంస్థలకు లోబడే ఆ దేశ యూజర్ల కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయనున్నట్లు యాపిల్ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది.