లాస్ ఏంజిల్స్, అక్టోబర్ 7: ప్రతి మహిళా పండంటి బిడ్డను ఎత్తుకోవాలని కోరుకుంటుంది. అయితే, గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఇందులో ఆందోళన అనేది అత్యంత ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది.
గర్భధారణ సమయంలో మహిళ ఆందోళన చెందితే ముందస్తు ప్రసవం (నెలలు నిండకుండానే) అయ్యే ముప్పుందని అమెరికా పరిశోధకులు తేల్చారు. 196 మంది గర్భిణులపై కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. బిడ్డ ఆరోగ్యం, ప్రసవం, పిల్లల పెంపకానికి సంబంధించిన ఆందోళన గర్భిణుల్లో ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.