e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి

జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి

జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి

బార్సిలోనా : యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ వ్యాపార‌వేత్త జాన్ మెకాఫీ .. స్పెయిన్‌లోని బార్సిలోనా జైలులో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. ప‌న్ను ఎగ‌వేత కేసులో అమెరికాకు అత‌న్ని అప్ప‌గించేందుకు స్పెయిన్ కోర్టు ఆమోదించిన త‌రుణంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం శోచ‌నీయం. జైలు డాక్ట‌ర్లు మెకాఫీని కాపాడేంద‌కు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండాపోయింది. అయితే మెకాఫీ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటార‌ని భావిస్త‌న్నారు. టెక్నాల‌జీ రంగంలో వివాదాస్ప‌ద వ్య‌క్తిగా మెకాఫీ నిలిచాడు. ఆయ‌న స్థాపించిన కంపెనీ తొలిసారి యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ను రిలీజ్ చేసింది. కంప్యూట‌ర్ ప్ర‌పంచంలో మెకాఫీ వైర‌స్ స్కాన్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే బిలియ‌న్ డాల‌ర్ల ప‌రిశ్ర‌మ‌గా మారింది. ఆ త‌ర్వాత ఆ కంపెనీని ఆయ‌న ఇంటెల్‌కు 7.6 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్మేశారు. ప‌న్ను ఎగ‌వేత కేసులో స్పెయిన్‌లో మెకాఫీని అరెస్టు చేశారు. ట‌ర్కీని విమానం ఎక్క‌బోతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ప‌న్నులు చెల్లించ‌కుండా త‌న సంపాద‌నంతా క్రిప్టోల్లో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు మెకాఫీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి
జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి
జైలులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మెకాఫీ మృతి

ట్రెండింగ్‌

Advertisement