న్యూయార్క్: ఏఐ సంస్థలు తమ మోడళ్లను మెరుగుపరిచే వేగాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించాలని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ కోరారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ సాంకేతికతను అర్థం చేసుకోవడం, నియంత్రించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అవి అధిగమించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
సెప్టెంబర్లో ‘వీ మస్ట్ పేస్ ది ఫ్రంటియర్’ పేరుతో రాసిన వ్యాసంలో అమోడీ ఈ విధంగా స్పందించారు. అభివృద్ధి వేగాన్ని తగ్గించినప్పటికీ ఏఐ పురోగతి వేగంగానే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే లభించే అదనపు సమయాన్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడానికి, కొత్తగా తలెత్తుతున్న ప్రమాదాలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చని తెలిపారు.