Google Job Cuts | ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.. సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల లేఖ..!
Google Job Cuts | లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియ సమయంలో ఉద్యోగుల పట్ల కాస్త పరిణతితో వ్యవహరించాలని ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ (Google parent Alphabet) ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Picha) ను కోరారు.
Google Job Cuts | లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియ సమయంలో ఉద్యోగుల పట్ల కాస్త పరిణతితో
వ్యవహరించాలని ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ (Google parent Alphabet)
ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Picha) ను కోరారు. సుమారు 1,400 మందికిపైగా ఉద్యోగులు (employees) ఉమ్మడిగా ఓ లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని లేఖలో కోరారు. ఈ మేరకు ఒక పిటిషన్ ( petition) పై సంతకాలు చేసి దాన్ని సీఈవోకు పంపించారు.
ఇదే సందర్భంలో ఉద్యోగులు పలు డిమాండ్లను సీఈవో (CEO)ముందు ఉంచారు. ‘ఉద్యోగుల క్షేమం కోసం
పలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం కొత్త నియామకాలను నిలిపివేయాలి. అంతేకాకుండా.. తొలగింపులు
చేపట్టేముందు స్వచ్ఛందంగా రిజైన్ చేసేందుకు ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో గూగుల్
(Google) చేపట్టే నియామకాల్లో ఇప్పుడు లేఆఫ్స్ (Layoffs) కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మానవతా సంక్షోభం నెలకొన్న ఉక్రెయిన్ (Ukraine) వంటి దేశాల్లోని ఉద్యోగులను తొలగించకూడదు. ఆ దేశాల్లో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగం పోతే వీసా సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సంస్థ ప్రత్యేకంగా సాయం అందించాలి’ అని ఉద్యోగులు తమ లేఖలో సీఈవోను డిమాండ్ చేశారు.
‘శ్రామిక శక్తిని తగ్గించుకునేందుకు గూగుల్ (Google) తీసుకున్న నిర్ణయం యొక్క ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఉద్యోగుల వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలైతే ఎక్కడా లేవు. వర్కర్ల ఐకమత్యంతో మా వాణిని బలంగా వినిపించవచ్చని అర్థమైంది’ అని ఉద్యోగులు తమ లేఖలో పేర్కొన్నారు. లేఆఫ్స్ ప్రారంభమయ్యాక తొలిసారిగా ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, గూగుల్ (Google) ఈ ఏడాది మొదట్లో సంస్థలో పనిచేసే సుమారు 12 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఖర్చులను తగ్గించుకోవడానికే ఇలా చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియ సమయంలో సంస్థ ఉద్యోగుల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించింది అంటూ చాలా మంది ఉద్యోగులు (Employees).. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉద్యోగులు సుందర్ పిచాయ్ (Sundar Picha) కు ఓపెన్ లెటర్ రాశారు.
తన సంస్థలో ఉద్యోగుల తొలగింపుల గురించి సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Picha) జనవరి 20న ప్రకటించారు. సంస్థలోని 6 శాతం మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు పేర్కొన్నారు. తమ అంచనాలకు భిన్నమైన ఆర్థికపరిస్థితి ఎదుర్కొంటున్నామని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. గూగుల్‌తో పాటూ మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ట్విట్టర్ వంటి పలు టాప్ సంస్థలన్నీ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయా కంపెనీలు ఆరు నెలల్లోనే వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి.
Also Read..
Dima Nova | తన పాటతో పుతిన్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసిన రష్యన్ పాప్ స్టార్ మృతి
Mrunal Thakur | సినీ ఇండస్ట్రీలో పదేండ్ల సంఘర్షణను తలచుకుంటూ ఎమోషనల్ అయిన మృణాల్ ఠాకూర్
David Warner: తగ్గేదేలే.. వార్నర్ సెలబ్రేషన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

