బాగ్దాద్: ఇరాన్‌పై యుద్ధాన్ని కవర్ చేసేందుకు ఇరాక్‌కు వెళ్లిన యూఎస్ జర్నలిస్ట్ షెల్లీ కిట్టెల్సన్ను బాగ్దాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మంగళవారం బాగ్దాద్‌లోని అల్ సాదూన్ స్ట్రీట్‌లోని హోటల్ వద్ద ఆమెను కొంతమంది అపహరించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఒక అనుమాతుడ్ని అదుపులోకి తీసుకున్నా, ఆమె ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విదేశీ జర్నలిస్ట్ ఒకరు కిడ్నాప్‌నకు గురైన విషయాన్ని ఇరాక్ హోం శాఖ ధృవీకరించింది.
కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకునేందుకు భద్ర తా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వతంత్ర జర్నలిస్ట్‌గా షెల్లీ కిట్టెల్సన్ ఇరాక్, అఫ్ఘానిస్థాన్ సహా పశ్చిమాదేశాల్లో పనిచేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న ప్రస్తుత యుద్ధ ప్రభావాన్ని రిపోర్ట్ చేసేందుకు ఇటీవలే ఆమె ఇరాక్‌కు వెళ్లారు.