వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం 1665 గాల్లో ఉండగా, దానిలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ నెల 25 ఉదయం లాస్ వెగాస్‌లోని హారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది.
ఇంజిన్‌లో మంటలు రావడంతో తిరిగి అదే విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనిలోని 159 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సురక్షితంగా కిందకు దిగారు. ఈ భయానక ఘటనపై దర్యాప్తు జరపనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.