వాషింగ్టన్: భార్యను, కుమారుడిని హత్య చేసిన కేసులో అమెరికాకు చెందిన చట్టసభప్రతినిధి(US Lawmaker) అలెక్స్ ముర్డాగ్( Alex Murdaugh) దోషిగా తేలారు. సౌత్ కరోలినా కోర్టు ఈ కేసులో శిక్షను ఖరారు చేయనున్నది. దక్షిణ కరోలినా(South Carolina)లో మేటి లాయర్ల కుటుంబానికి చెందిన వ్యక్తి అలెక్స్ ముర్డాగ్. ఆయన వయసు 54 ఏళ్లు. కుమారుడు పాల్‌ను షార్ట్‌గన్(Shortgun)తో.. భార్య మ్యాగీని అజాల్ట్ రైఫిల్(Assault Rifle)తో షూట్ చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడవి పందుల్ని వేటాడేందుకు వాడుతున్న గన్స్‌తో అతను ఆ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో జడ్జి క్లిఫ్టన్ న్యూమ్యాన్ విచారణ చేపట్టారు. అలెక్సీను దోషిగా తేల్చేందుకు కావాల్సినన్ని ఆధారాలు ఉన్నట్లు జడ్జి తెలిపారు. ముర్డాగ్కు చెందిన కేసు గురించి 2021 జూన్‌లోనే జ్యూరీ విచారణ చేపట్టింది. న్యాయ సంస్థకు చెందిన మిలియన్ల డాలర్లను డ్రగ్స్ కోసం ముర్డాగ్ వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తన బలహీనతను దాచిపెట్టేందుకు ముర్డాగ్ ఆ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.