ఓస్లో: అలెస్ బియాలియాస్కీ(Ales Bialiatski). ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి గెలిచిన అడ్వకేట్ ఈయన. అలెస్తో పాటు మరో రెండు మానవ హక్కుల సంస్థలు కూడా ఆ ప్రైజ్‌ను పంచుకున్నాయి. బియాలియాస్కీది బెలారస్. 1980 దశకంలో ఆ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఆయన నడిపారు. స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని, శాంతియుత అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.
వియస్నా(స్ప్రింగ్) అన్న సంస్థను 1998లో ఆయన స్థాపించారు. వివాదాస్పద రాజ్యాంగ సవరణల ద్వారా ఆ దేశ అధ్యక్షుడు నియంతృత్వ శక్తుల్ని పొందారు. దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగాయి. ఆ సమయంలో వియస్నా సంస్థను స్థాపించిన అడ్వకేట్ అలెస్ మానవ హక్కుల కోసం తీవ్ర పోరాటం చేశారు. అధ్యక్ష అధికారాలను వ్యతిరేకిస్తూ జైలుపాలైన ఆందోళనకారులకు, వాళ్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు. కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఆ సంస్థ పూర్తి స్థాయి మానవ హక్కుల సంస్థగా రూపాంతరం చెందింది. రాజకీయ ఖైదీలకు మద్దతుగా ఆ సంస్థ పోరాటం చేసింది.
అలెస్ బియాలియాస్కీని అణగదొక్కేందుకు ప్రభుత్వ అధికారులు పదే పదే ప్రయత్నించారు. ఆయన్ను 2011 నుంచి 2014 వరకు జైల్లో వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2020లోనూ భారీ ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలోనూ ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు. ఎటువంటి విచారణ లేకుండానే ఆయన్ను ఇంకా జైలులో ఉంచారు. ఎన్నో వ్యక్తిగత అవరోధాలను ఎదుర్కొన్న అలెస్.. బెలారస్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏమాత్రం తలొగ్గలేదు.
Ales Bialiatski – awarded the 2022 #NobelPeacePrize – was one of the initiators of the democracy movement that emerged in Belarus in the mid-1980s. He has devoted his life to promoting democracy and peaceful development in his home country.#NobelPrize pic.twitter.com/p1KHHFkSse
— The Nobel Prize (@NobelPrize) October 7, 2022