మంగళవారం 31 మార్చి 2020
International - Feb 11, 2020 , 02:10:57

‘స్మార్ట్‌..సోషల్‌'తో సూసైడ్‌ ముప్పు

‘స్మార్ట్‌..సోషల్‌'తో సూసైడ్‌ ముప్పు
  • అధికంగా వాడితే మానసిక సమస్యలు ఖాయం.. కెనడా పరిశోధకుల హెచ్చరిక

టొరంటో: స్మార్ట్‌ఫోన్‌ను, సోషల్‌ మీడియాను లోకంగా భావించేవారికి హెచ్చరిక. అతిగా వాడితే మానసిక సమస్యలు తలెత్తడంతోపాటు కౌమారులు ఆత్మహత్య కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కెనడా శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు. స్మార్ట్‌ఫోన్లకు బానిసైన యువతలో మానసిక ఒత్తిడితోపాటు చదువులో వెనుకబడటం, నిద్రలేమి, వ్యక్తిగత అశ్రద్ధ వంటి సమస్యలు తలెత్తుతాయని, కుటుంబ సంబంధాలపైనా ఇది ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ దుష్ఫ్రభావాలను తగ్గించేందుకు కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. యువత స్మార్ట్‌ఫోన్‌, సోషల్‌ మీడియాలో వెచ్చించే సమయాన్ని క్రమంగా తగ్గించాలని, ఒకేసారి నిషేధిస్తే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇది ఆత్మహత్యకు పురిగొల్పవచ్చని హెచ్చరించారు. 

logo
>>>>>>