అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడు.. 9/11 దాడికి 20 ఏళ్ల సందర్భంగా వీడియో సందేశం

9/11 attack: చనిపోయాడనుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్మాన్ అల్-జవహిరి బతికే ఉన్నాడు. తాజాగా 9/11 దాడి జరిగి 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అతడు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. అల్‌ఖైదా అధికారిక మీడియా అస్-సహబ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత అల్‌ఖైదా బాధ్యతలు తీసుకున్న జవహిరి.. చాలాకాలంగా అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు. గతేడాది నవంబర్‌లో అతడు అనారోగ్యంతో మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని నుంచి వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి.
శనివారం విడుదలైన ఈ వీడియోలో జవహిరి పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు. సెప్టెంబర్ 11 ఉదయం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్లలో ఈ వీడియో వస్తోందంటూ అస్-సహబ్ ప్రోమోలు నడిపించింది. ఆ తర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జవహిరి రాసిన 852 పేజీల బుక్‌ను రిలీజ్ చేసింది అల్‌ఖైదా. ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్కచోట మాత్రమే అతడు ఆఫ్ఘనిస్థాన్ గురించి ప్రస్తావించాడు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మళ్లీ ఇంటిదారి పట్టిందని అన్నాడు. 9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులను అతడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

