Columbia University | విద్యావంతుల్లో వృద్ధాప్యం ఆలస్యం: కొలంబియా వర్సిటీ
చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు, మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందట. ఉన్నత విద్యావంతులు మిగతావారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని, వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
- కొలంబియా వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Columbia University | న్యూయార్క్, మార్చి 3: చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు, మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందట. ఉన్నత విద్యావంతులు మిగతావారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని, వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మయిల్మెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో విద్యకు, వృద్ధాప్యానికి మధ్య సంబంధం ఉందని గుర్తించారు.
అమెరికాలోని ఫ్రెమింగ్హామ్ నగరంలో ఫ్రెమింగ్హామ్ హార్ట్ స్టడీ పేరుతో 1948 నుంచి అక్కడి ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తీసుకొని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం జరపగా.. ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి రెండేండ్ల పాఠశాల విద్యను అభ్యసించడం వల్ల వృద్ధాప్యం మీదపడటం 2 నుంచి 3 శాతం ఆలస్యమవుతుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ వ్యక్తుల కంటే ఉన్నత విద్యావంతుల్లో మరణ ముప్పు 10 శాతం తక్కువగా ఉంటుందని తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

