North Korea: మళ్లీ ఐసీఎంబీని పరీక్షించిన ఉత్తర కొరియా
Intercontinental Ballistic Missile: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించింది. ఆ మిస్సైల్ జపాన్ జలాల్లో పడింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా వెల్లడించింది. ఇటీవల అమెరికా వార్నింగ్ ఇచ్చినా.. ఉత్తర కొరియా మాత్రం తన మిస్సైల్ టెస్టింగ్‌ను ఆపడం లేదు.
ప్యోంగ్యాంగ్: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. ఐసీఎంబీని నార్త్ కొరియా పరీక్షించినట్లు జపాన్, దక్షిణ కొరియా దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ దూరం వెళ్లే ఆ క్షిపణి దాదాపు గంటన్నర వరకు గాలిలో ప్రయాణించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ మిస్సైల్ జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు వెల్లడించారు. ఇటీవల అమెరికా నిఘా విమానాల ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా మరోసారి ఐసీఎంబీ పరీక్షతో అమెరికాకు వార్నింగ్ ఇచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ అమెరికా విమానాల తమ గగనమార్గంలోకి ప్రవేశిస్తే వాటిని షూట్ చేస్తామని కూడా ఉత్తర కొరియా హెచ్చరించిన విషయం తెలిసిందే. నార్త్ కొరియా చేసిన ఆరోపణల్ని అమెరికా ఖండించింది. తమ సైనిక దళాల పెట్రోలింగ్ అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు వెల్లడించింది. ఇటీవల నార్త్ కొరియా వరుసగా క్షిపణుల్ని పరీక్షించడంతో ఉద్రిక్తత మొదలైంది. ఆ తర్వాత అమెరికా, సౌత్ కొరియా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టాయి.
ఈ మధ్య కాలంలో డజన్ల సంఖ్యలో ఉత్తర కొరియా పరీక్షలు చేపట్టింది. దాంట్లో ఓ నిఘా శాటిలైట్ కూడా ఉంది. అయితే ఆ పరీక్షలో ఉత్తర కొరియా విఫలం అయ్యింది. ఘన ఇంధనానికి చెందిన ఐసీబీఎంను పరీక్షించినట్లు నార్త్ కొరియా ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

