ఇస్లామాబాద్: గత ఏడాది ఆసియాకప్‌లో భారత, పాక్ కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని విషయం తెలిసిందే. ఆ వివాదంపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా(Salman Agha) మరికొన్ని విషయాలను వెల్లడించాడు. ఆఘా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు ఇండియా నిరాకరించింది. కానీ ఆసియా కప్ ట్రోఫీని పరిచయం చేసేందుకు ఆటగాళ్ల ఫోటోషూట్ జరిగిందని, ఆ సమయంలో కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నట్లు సల్మాన్ ఆఘా తెలిపాడు. ఆఘా ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలిపాడు.
ఇండోపాక్ మ్యాచ్ రోజున.. టాస్ వేయడానికి కొన్ని క్షణాల ముందు తనకు హ్యాండ్‌షేక్ గురించి తెలిసిందని ఆఘా అన్నాడు. మీడియా మేనేజర్ నయీమ్ భాయ్‌తో కలిసి టాస్కు వెళ్లానని, ఆ సమయంలో మ్యాచ్ రిఫరీ తనను ఓ పక్కకు తీసుకెళ్లాడని, హ్యాండ్‌షేక్ ఉండదని చెప్పాడన్నాడు. హ్యాండ్‌షేక్ లేకున్నా పర్వాలేదని అభిప్రాయపడ్డానని, ఆ విషయంలో తానేమీ శ్రద్ధపెట్టలేదని ఆఘా అన్నాడు. హ్యాండ్‌షేక్ ఉండబోదన్న విషయాన్ని తనకు తొలుత మ్యాచ్ రిఫరీ చెప్పినట్లు ఆఘా పేర్కొన్నాడు.
అయితే టాస్ సమయంలో షేక్‌హ్యాండ్ ఇవ్వకున్నా.. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్ ఉంటుందని భావించినట్లు ఆఘా చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు సభ్యులు అందరం కలిసి భారత క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లామని, కానీ డోరు మూసి ఉన్నట్లు గుర్తించామని ఆఘా తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద కూడా భారత ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో తలపడ్డా అప్పుడు కూడా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదని ఆఘా అన్నాడు.
Salman Ali Agha relieved about India vs Pakistan handshake controversy:
Before the match, there was a press conference and a trophy shoot, and there was a handshake there too. So when I was going for the toss, I was pretty normal. I said, “Obviously, I had an idea that things… pic.twitter.com/zImpcx7pG1
— TEJASH (@Tejashyyyyy) May 2, 2026