Pakistan Expels Iran Ambassador | ఇరాన్ రాయబారిని బహిష్కరించిన పాకిస్థాన్.. తమ రాయబారిని రీకాల్
Pakistan Expels Iran Ambassador | తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్‌కు తిరిగి రావద్దని పేర్కొంది.
ఇస్లాబామాద్: తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ బహిష్కరించింది. (Pakistan Expels Iran Ambassador) ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్‌కు తిరిగి రావద్దని పేర్కొంది. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న తమ రాయబారులను పాకిస్థాన్ వెనక్కి పిలిపించింది. ఉన్నత స్థాయి అధికారుల ఇరాన్ సందర్శనను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
కాగా, పాకిస్థాన్‌లోని బలూచ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. జైష్-అల్-అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై దాడి చేసినట్లు మంగళవారం తెలిపింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించగా మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇరాన్ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని పాకిస్థాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న సంకేతంగా దీనిని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Air strikes
- Ambassador
- Envoy
- expels
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

