Aeolus Satellite | డెడ్ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి కూల్చివేత
Aeolus Satellite | డెడ్ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్ కంట్రోల్ నుంచి శాటిలైట్ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు.
లండన్: డెడ్ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌బస్ ఇంజినీర్లు వాతావరణాన్ని పర్యవేక్షించే ఏయోలస్ ఉపగ్రహాన్ని (Aeolus Satellite) నిర్మించారు. 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) దీనిని లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ కాలపరిమితి ఐదేళ్లు. ఇటీవల ఇంధనంతోపాటు మిషన్ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్ అయిన ఈ శాటిలైట్ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్నది. అయితే నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి తెచ్చి సురక్షితంగా కూల్చివేసే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించలేదు.
కాగా, శాటిలైట్ ఏయోలస్‌ను సురక్షితంగా కూల్చివేయడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్ కంట్రోల్ నుంచి శాటిలైట్ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు. దీంతో ఈ నెల 24న ఆ డెడ్ శాటిలైట్ 280 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నది. ఆ తర్వాత దాని ఎత్తు 250 కిలోమీటర్లకు తగ్గించారు. అలా క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం నాటికి భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు ఏయోలస్ చేరుకున్నది. అనంతరం దాని కక్ష్యను మరింతగా మార్పు చేశారు. చివరకు ఆ శాటిలైట్ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

