Canada : కాలుష్యాన్ని తగ్గించాలని, జీవ వైవిధ్యాన్నికాపాడాలని పర్యావరణ ప్రేమికులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల నాయకుల నుంచి ప్రతిసారి వాళ్లకు నిరాశే ఎదురవుతోంది. తాజాగా కెనడాలో మాట్రియెల్ నగరంలో కొందరు వినూత్నంగా ర్యాలీ తీశారు. వందల సంఖ్యలో పర్యావరణ యాక్టివిస్టులు చెట్లు, పక్షులు, నాలుగు కొమ్ముల జింక మాదిరిగా డ్రెస్లు వేసుకుని మాంట్రియల్ వీధుల్లోకి వచ్చారు. ఈ ఏడాది మాంట్రియెల్లో కాప్-15 జీవవైవిధ్య సదస్సు జరుగుతోంది. రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో 193 ప్రపంచ నేతలు పాల్గొంటున్నారు. పర్యావరణ ప్రేమికులను కూడా ఈ సదస్సులోకి అనుమతించారు. అయితే.. జీవ వైవిధ్యాన్ని కాపాడే దిశగా ప్రపంచ నాయకులు తీసుకునే చర్యలు సరిపోవని పర్యావరణ యాక్టివిస్టులు భావించారు. ఈ నేపథ్యంలో యాక్టివిస్టులు వెరైటీగా నిరసన తెలియజేయాలి అనుకున్నారు. వీళ్లు ర్యాలీ తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత కాప్ సదస్సుల్లో పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకోవడంలో దేశాధినేతలు విఫలం అయ్యారని , ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ర్యాలీలో పాల్గొన్నవాళ్లు విమర్శించారు. ప్రభుత్వాలు ఒక ఉప్పందానికి రాకపోవడం వల్ల 10 లక్షల మొక్కలు, కీటకాలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని వాళ్లు వెల్లడించారు. ఈ ర్యాలీని ప్రపంచవ్యాప్తంగా పౌర ఉద్యమాలు చేసే ఆవాబ్ అనే సంస్థ నిర్వహించింది. ‘ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రావడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అంతరించిపోయు ప్రమాదంలో ఉన్న జీవజాతిని మనం కాపాడుకోవాలి’ అని ఈ సంస్థ డైరెక్ట్ ఆస్కార్ సోరియా తెలిపాడు. కాప్-15 సదస్సులో 24 అంశాల మీద చర్చించనున్నారు. 2030 నాటికల్లా ప్రపంచంలోని 30 శాతం భూ, సముద్ర జలాల్ని కలుషితం కాకుండా చూడాలనే అంశం కూడా ఉంది.
Indigenous women sing the Warrior Song at the front of the march. ✊ No nature protection without Indigenous women. #COP15 #ProtectNature pic.twitter.com/OYjeNBW42r
— Greenpeace Canada (@GreenpeaceCA) December 10, 2022
Great to see so much colour, noise, creativity alongside so many @BirdLife_News partners at the #COP15 March for nature and human rights in Montreal today pic.twitter.com/savBAPoVvq
— Martin Harper (@martinBirdLife) December 10, 2022