వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో సుమారు 500 తిమింగళాలు (పైలట్ వేల్స్) మృతిచెందాయి. చాథమ్ దీవుల వద్ద ఆ జల జీవాలు ప్రాణాలు విడిచాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. చాథమ్ దీవుల్లో 250, పిట్ దీవిలో మరో 240 తిమింగళాలు మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది.
న్యూజిలాండ్‌కు చాలా దూరంగా ఆ దీవులు ఉన్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో షార్క్‌లు ఉన్నాయని, అవి మనుషులపై, వేల్స్‌పై దాడి చేసే అవకాశం ఉందని, అందుకే రెస్క్యూ ఆపరేషన్ అసాధ్యంగా మారినట్లు మెరైన్ అడ్వైజర్ దేవ్ లుండ్కిస్ట్ తెలిపారు.
అయితే సహజంగానే ఆ తిమింగళాలు డీకంపోజ్ కానున్నట్లు అధికారులు చెప్పారు. చాథమ్ దీవిలో 1918లో అత్యధికంగా ఒకేసారి సుమారు వెయ్యికిపైగా తమింగళాలు మృత్యువాతపడ్డాయి. పైలట్ వేల్స్ కనీసం ఆరు మీటర్ల పొడుగు ఉంటాయి.