Venezuela Earthquake: భూకంప శిథిలాల్లో శిశువు జననం.. వెనిజువెలాలో హృదయవిదారకర ఘటన.. వీడియో
Venezuela Earthquake: వెనిజువెలాలో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ఓ గర్భిణ ప్రసవించింది. మగ బిడ్డకు ఆ మహిళ జన్మనిచ్చింది. స్థానికులు ఆమెకు బిడ్డను కాపాడారు. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కారకాస్: నిమిషం తేడాతో సంభవించిన రెండు భూకంపాల వల్ల వెనిజువెలా(Venezuela Earthquake) అతలాకుతలమైంది. లా గువైరా రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగింది. అనేక బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద ఓ గర్భిణి.. మగపిల్లాడికి జన్మనిచ్చింది. బుధవారం సాయంత్రం వెనిజువెలాలో జంట భూకంపాలు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే శిథిలాల్లో చిక్కుకున్న ఓ మహిళ.. శిశువుకు జన్మనిచ్చింది. సుమారు రెండు రోజల పాటు శిథిలాల కింద ఉన్న ఆమెను బయటకు తీశారు. స్థానికులు ఆమెకు ఆ శిథిలాల్లోనే పురుడు పోశారు. శిథిలాల్లో చిక్కుకున్న ఆ మహిళ ఎంత ప్రసవ వేదన అనుభవించిందో..
A powerful moment from Venezuela 🇻🇪❤️
A woman reportedly gave birth beneath the earthquake rubble as rescuers searched for survivors.
Even in the darkest moments, life finds a way. pic.twitter.com/kUl9lfVXHA
— Geo Think Tank (@JohnKennedy869) June 26, 2026
తాజా సమాచారం ప్రకారం వెనిజువెలాలో భూకంపాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 235కు చేరుకున్నది. ఇక 4300 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

