ఇంటర్నెట్లో ఎన్నో అద్భుతమైన వీడియోలు కనిపిస్తాయి. ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంటాయి. అసలు ఆ వీడియోలో ఉన్నది నిజమా? కాదా? అని తెలుసుకునేలోపే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో అలాంటి ఓ వీడియో హల్చల్ చేస్తోంది. 54 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నది. ఈ వీడియోలో ఓ మహిళ నీటి అడుగున తలకిందులుగా క్యాట్‌వాక్ చేస్తూ కనిపించింది. మళ్లీ యధాస్థానానికి వచ్చి నడుచుకుంటూ వెళ్లింది.
అవును మీరు చదివింది నిజమే. ఆ మహిళ పేరు క్రిస్టినా మకుషెంకో. ఆమె సింక్రొనైజ్జ్ స్విమ్మింగ్‌లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్. ఆమె నీటి అడుగున డ్యాన్స్ కూడా చేయగలదు. మంచి ప్రదర్శకురాలు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో క్రిస్టినా తలకిందులుగా క్యాట్‌వాక్ చేసి మళ్లీ మామూలుగా చేసింది. తలకిందులుగా ఉన్న సమయంలో ఆమె స్విమ్మింగ్ షూట్లో కాళ్లకు హై హీల్స్ వేసుకుని,హ్యాండ్‌బ్యాగ్ పట్టుకొని మరీ క్యాట్‌వాక్ చేసి అబ్బురపరిచింది. ఇన్‌స్టాలో పెట్టిన ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.