న్యూయార్క్, ఆగస్టు 14: జ్వరం వచ్చినా.. దగ్గు వచ్చినా.. జలుబు పట్టుకున్నా.. యాంటీ బయాటిక్స్ ఎడాపెడా వాడేస్తుంటారు. మెడికల్ షాప్స్లో విచ్చలవిడిగా ఇచ్చేస్తుంటారు. దీంతో బ్యాక్టీరియాలు ఈ మందులకు నిరోధకతను పెంచుకుంటున్నాయి. అయితే దాదాపు 300కు పైగా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలపై పనిచేసే సరికొత్త మందును పరిశోధకుల బృందం అభివృదిచే సింది.
న్యూమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు కారకమైన అనేక బ్యాక్టీరియాలపై ‘ఫాబిమైసిన్’ అనే డ్రగ్ సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియాలను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఫాబిమైసిన్ మందును అభివృద్ధిపరిచింది.