లండన్: గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
అకస్మాత్తుగా గర్భస్థ శిశు మరణాలు సంభవించవచ్చని తేలింది. అన్ని రకాల నికోటిన్ ఉత్పత్తులకు గర్భిణులు దూరంగా ఉండాలని స్వీడన్లోని కరోలిన్స్కా పరిశోధకులు సూచించారు. ఈ అధ్యయనం పీడియాట్రిక్ రిసెర్చ్ జర్నల్లో ప్రచురితమైంది.