సిడ్నీ : డేవిడ్ మారియట్.. ఓ టీవీ కమర్షియల్ ఆర్ట్ డైరెక్టర్. ఆస్ట్రేలియా వచ్చి కరోనా కారణంగా హోటల్ గదికి పరిమితమైపోయాడు. మూడు రోజుల దాకా బాగానే గడిచింది.. టీవీ సీరియల్స్, నెట్ సర్ఫింగ్ బోర్ కొట్టింది. ఏదైనా సృజనాత్మకంగా చేద్దామని ఆలోచిస్తుండగా హోటల్ సిబ్బంది ఆహారం తెచ్చిచ్చే బ్రౌన్ కాగితాల మీద దృష్టి పడింది. అంతే. మారియట్ పేపర్ కౌబాయ్‌గా మారిపోయాడు.
హ్యాటు, ప్యాంటు, జాకెట్ అన్ని అమిరాయి. ఇక గుర్రమొక్కటే తక్కువ. ఆ ఒక్కటీ వదిలేయడం ఎందుకని ఇస్త్రీ టేబిలు, నైట్ ల్యాంప్ కలిపి గుర్రాన్ని తయారు చేశాడు. ఆ గుర్రంతో మారియట్ కబుర్లు చెప్తుంటాడు. క్యాస్టవేలో టాం హ్యాక్స్ లాగా దాంతో ఫిలాసఫీ మాట్లాతుంటాడు. ఆ వీడియోలు నెట్లో పెట్టాడు. ప్రస్తుతం పేపర్ కౌబాయ్ వీడియోలు నెట్లో వైరల్ అయ్యాయి.