వాషింగ్టన్: శునకాల జీవితకాలాన్ని పెంచేందుకు అభివృద్ధి చేసిన ఔషధంపై అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వెటర్నరీ మెడిసిన్లో ఇదొక గొప్ప ముందడుగుగా సైం టిస్టులు భావిస్తున్నారు. నాలుగేండ్లపాటు సాగే క్లినికల్ ట్రయల్స్ కోసం శాన్ఫ్రాన్సిస్కో లోని ‘లాయల్’ అనే జంతు ఆరోగ్య సంస్థ పెద్ద సంఖ్యలో కుక్కలను రిక్రూట్ చేసుకుంటున్నది.
ఇప్పటికే వెయ్యి శునకాలపై క్లినికల్ ట్రయ ల్స్ పూర్తికాగా, ఇందుకు సంబంధించి నివేదికను ‘ఎఫ్డీఏ’ ఆమోదానికి పంపినట్టు సంస్థ తెలిపింది. గత కొన్ని వేల సంవత్సరాల్లో మానవుల జీవితకాలం పెరిగినంతగా, శునకాల్లో జీవిత కాలం పెరగలేదు. కుక్కల్లో జీవక్రియ రేటు మానవుల్లో కన్నా వేగంగా ఉండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు.