Phil stringer | ఓక్లహామా, జూన్ 28: అమెరికాలో 18 గంటలు ఆలస్యంగా నడిచిన ఓ విమానం అందులోని ఓ ప్రయాణికుడికి రాజ భోగాలు కల్పించింది. అనుకోకుండా జరిగిన ఈ ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఆదివారం ఓక్లహామా నుంచి చార్లొట్ బయల్దేరిన విమానం 18 గంటలు ఆలస్యంగా నడిచింది.
దీంతో తూర్పు కరోలినాకు చెందిన ఫిల్ స్ట్రింజర్ తప్ప మిగతా ప్రయాణికులంతా వేరే విమానాలు లేదా ప్రత్యామ్నాయ రవాణా మార్గాల్లో గమ్య స్థానానికి వెళ్లిపోయారు. దీంతో స్ట్రింజర్ ఒక్కడే మిగిలాడు. అయితే ఆ ఒక్కడితోనే విమానం గమ్య స్థానానికి బయల్దేరింది. ఈ ప్రయాణంలో స్ట్రింజర్కు ఉచితంగా ఫస్ట్ క్లాస్ పాస్ లభించడంతో పాటు విమాన సిబ్బందితో ప్రైవేట్ పార్టీ చేసుకొనే చాన్స్ దక్కింది. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆహార పానీయాలను ఆస్వాదించే అవకాశం లభించింది. ఒక్కడే ప్రయాణికుడు కావడంతో విమాన సిబ్బంది అతడితో సరదాగా జోకులు వేశారు.