వాషింగ్టన్, ఫిబ్రవరి 2: ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ కార్ల గురించే చర్చ.. రోజురోజుకు పెరిగితున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించటం కంటే ఎలక్ట్రిక్ కారును కొనటం మేలని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ కార్లకు చార్జింగ్ కీలకం. ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ఎక్కడైనా చార్జింగ్ అయిపోతే ఎలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి చార్జింగ్ అవసరం లేని కారు వస్తే.. వస్తే కాదు.. వచ్చేస్తున్నది మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అప్టెరా మోటర్స్ చార్జింగ్ అవసరం లేని కారును తీసుకొస్తున్నది. మీరు కారులో ప్రయాణిస్తుండగానే చార్జింగ్ అవుతుంటుంది. సూర్యరశ్మి ద్వారా ఈ చార్జింగ్ అవుతుంది. ఇందుకోసం కారులో సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లేట్లు బయటికి కనిపించవు.
కారు ప్రత్యేకతలు