Microsoft | 85 లక్షల డివైజ్‌లపై ప్రభావం.. ఐటీ అంతరాయంపై మైక్రోసాఫ్ట్
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల విండోస్ డివైజ్‌లపై పడినట్టు ప్రస్తుతం అంచనా వేస్తున్నట్టు శనివారం తన బ్లాగ్‌లో వెల్లడించింది.
- సాఫీగా విమానయాన సేవలు
Microsoft | వాషింగ్టన్, జూలై 20: మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల విండోస్ డివైజ్‌లపై పడినట్టు ప్రస్తుతం అంచనా వేస్తున్నట్టు శనివారం తన బ్లాగ్‌లో వెల్లడించింది. మొత్తం విండోస్ డివైజ్‌లలో ఇది ఒక శాతం కంటే తక్కువేనని పేర్కొన్నది. మైక్రోసాఫ్ట్ అజూర్‌లో సమస్యను పరిష్కరించేందుకు క్రౌడ్‌స్ట్రైక్ సాయం చేసినట్టు వెల్లడించింది. ఇందుకోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్‌తో కూడా కలిసి పని చేసినట్టు తెలిపింది.
యథావిధిగా విమానయాన సేవలు
మైక్రోసాఫ్ట్‌లో ఎర్రర్‌తో శుక్రవారం తీవ్ర అంతరాయాలు ఎదుర్కొన్న విమానయాన సేవలు కుదుటపడ్డాయి. శనివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఎయిర్‌లైన్స్ వ్యవస్థలన్నీ సాధారణంగా పని చేస్తున్నాయని, విమాన కార్యకలాపాలన్నీ సాఫీగా సాగుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రయాణ సర్దుబాట్లు, టికెట్ చార్జీల రీఫండ్లు సరిగ్గా జరిగేలా విమానయాన శాఖ పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. కాగా, శనివారం కూడా శంషాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దయినట్టు అధికారులు తెలిపారు.
వంద శాతం చార్జీలు వాపస్
న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు సాంకేతిక సమస్య వల్ల 30 గంటలు ఆలస్యంగా వెళ్లిన ఏఐ-183 విమాన ప్రయాణికులకు ‘ఎయిర్ ఇండియా’ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు వారి చార్జీలను పూర్తిగా వాపసు ఇస్తామని, అదనంగా తర్వాత ప్రయాణించేందుకు కూపన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి రష్యాలోని క్రాస్నోయార్స్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. దీంతో ఈ విమానం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు 30 గంటలు ఆలస్యంగా చేరుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

