పొక్రోవిస్కీ: ఉక్రెయిన్‌లోని పొక్రోవిస్కీపై రష్యా విరుచుకుపడింది. అరగంట వ్యవధిలో రెండు మిసైళ్లతో అటాక్ చేసింది. ఇస్కాండర్ క్షిపణులతో దాడి(Missile Strike) చేసింది. ఆ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఓ ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్ ఆ దాడిలో గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. క్షిపణులు పడిన ప్రాంతంలో ఉన్న భవనాల్లో ఉన్న కిటికీల అద్దాలు పగిపోయాయి. దాదాపు ఓ బిల్డింగ్‌లోని రెండు వేల అద్దాలు ధ్వంసం అయ్యాయి. హోటళ్లు, షాపులు, ప్రభుత్వ బిల్డింగ్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. వరుస క్షిపణుల దాడిలో 81 మంది గాయపడ్డారని, దాంట్లో 38 మంది పౌరులు, 31 మంది పోలీసులు ఉన్నట్లు మిలిటరీ అధికారి తెలిపారు.