బుధవారం 27 మే 2020
International - Apr 08, 2020 , 12:41:47

బాలిలో చిక్కుకుపోయిన 80 మంది భారతీయులు

బాలిలో చిక్కుకుపోయిన 80 మంది భారతీయులు

బాలి: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు స్తంభించిపోయాయి. జ‌నం ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండిపోవాల్సి వ‌చ్చింది. విదేశాల‌కు విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన భారతీయులు విదేశాల్లోనే, భార‌త్‌లో విహార‌యాత్ర‌కు వ‌చ్చిన విదేశీయులు భార‌త్‌లోనే చిక్కుకుపోయారు. ఈ క్ర‌మంలోనే ఇండోనేషియాలోని బాలిలో కూడా 80 మంది భార‌తీయులు చిక్కుబ‌డిపోయారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఐదుగురు, విజయవాడకు చెందిన వారు ఐదుగురు, ఇద్దరు తిరుపతి వాసులు ఉన్నట్లు తెలిసింది. విహార యాత్ర‌ల కోసం ఇండోనేషియా వెళ్లిన వారంతా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో బాలిలో ఉండిపోయారు. ప్రస్తుతం బాలిలోని ఒక‌ హోటల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశం చేరుకునేందుకు ప్రభుత్వాలు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo