లండన్, డిసెంబర్ 4: వీసా నిబంధనల్ని కఠినతరం చేయటం, వర్సిటీలు ఫీజుల్ని భారీగా పెంచటంతో యూకేను వీడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 2025 జూన్ నాటికి 74 వేల మంది భారతీయ విద్యార్థులు యూకే నుంచి వెళ్లిపోయారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం, పీజీ విద్యార్థులు ‘డిపెండెంట్’ను తీసుకురావడానికి వీల్లేదు. దీంతో డిపెండెంట్ వీసా దరఖాస్తులు 86శాతం తగ్గాయి. అలాగే భారతీయ విద్యార్థుల నుంచి కొత్తగా వీసా దరఖాస్తులు 11 శాతం పడిపోయాయి.