Crocodiles Attack: 72 ఏళ్ల వ్యక్తిపై 40 మొసళ్ల దాడి..
Crocodiles Attack: 72 ఏళ్ల వ్యక్తిపై 40 మొసళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్వంత ఫామ్‌హౌజ్‌లో ఉన్న ఎన్‌క్లోజర్‌లో గుడ్లను తొలగిస్తున్న సమయంలో మొసళ్లు అటాక్ చేశాయి.
ఫెనోమ్ పెన్: కంబోడియాలో ఓ వ్యక్తి 40 మొసళ్లకు ఆహారం అయ్యాడు. తమ కుటుంబానికి చెందిన సరీసృపాల ఫామ్‌హౌజ్‌లోనే ఈ ఘటన జరిగింది. సీమ్ రీప్ ప్రాంతంలో ఉన్న ఓ మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడ్డ 72 ఏళ్ల వ్యక్తిపై మూకుమ్మడి దాడి(Crocodiles Attack) చేశాయి. ఆ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
గుడ్లు పెట్టిన ఓ మొసలిని కేజ్ నుంచి తీస్తున్న సమయంలో.. ఆ వ్యక్తి పట్టుకున్న కర్రను మొసలి లాగేసింది. ఆ సమయంలో ఆ వృద్ధుడు మొసళ్ల కేజ్‌లో పడిపోయాడు. ఇక ఆ కేజ్‌లో ఉన్న మొసళ్ల గ్యాంగ్ అతనిపై దాడి చేశాయి. ఆ వ్యక్తి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి. కాంక్రీట్ ఎన్‌క్లోజర్ కాస్త పూర్తిగా రక్తసిక్తమైంది.
ఆ వ్యక్తి చేతిని మొసళ్లు కొరికేశాయని, కొన్ని మొసళ్లు ఆ చేయిని మింగేసినట్లు పోలీసులు తెలిపారు. కంబోడియాలో మొసళ్ల దాడి ఘటన ఇటీవల మరొకటి కూడా చోటుచేసుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cambodia
- Crocodiles
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

